చంద్రబాబు ను తీవ్రంగా విమర్శించిన అంబటి రాంబాబు || Ambati Rambabu Criticized TDP Chief Chandrababu

2019-09-09 66

YSRCP leader and spokesperson Ambati Rambabu criticized TDP chief Chandrababu Naidu for unnecessarily targeting Andhra Pradesh Chief Minister YS Jagan Mohan Reddy and YSRCP development schemes. Speaking at a press meet on Saturday, Ambati Rambabu said that It was unfortunate that Chandrababu was trying to mislead AP people, and unnecessarily searching for flaws in the YSRCP government. He further said that Chandrababu should remember the way people made his son Lokesh lose in the elections.
#YSRCP
#AmbatiRambabu
#ChandrababuNaidu
#TDP
#jagan
#amaravathi
#lokesh

రాజకీయ అవినీతిని అంతం చేయాలనే దృఢ సంకల్పం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. వందరోజుల పాలనలో ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. స్వచ్చమైన, పారదర్శక, అవినీతి రహిత, విప్లవాత్మక పాలను అందించేందుకు ఇకపై కూడా ఆయన కృషి చేస్తారని తెలిపారు. అంబటి రాంబాబు శనివారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ప్రభుత్వంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై బురదజల్లుతూ..తన అభిప్రాయాన్ని ప్రజలపై రుద్దేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలన చూసిన ప్రజలు ఎన్నికల్లో ఆయన కుమారుడు లోకేశ్‌ను ఓడించిన విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తే కనీసం టీడీపీ నాయకులెవరూ ఆ పర్యటనలో పాల్గొనలేదని.. ఇప్పటికైనా బాబు ఓవరాక్షన్‌ తగ్గించుకోవాలని సూచించారు.